
– కరపత్రాలు ఆవిష్కరించిన బహుజన కమ్యూనిస్టు పార్టీ నాయకులు..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
బహుజనులంతా ఏకమై మతోన్మాదానికి వ్యతిరేకంగా ఉద్యమించి మారోజు వీరన్న ఆశయాలను కొనసాగించాలని బహుజన కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కే పర్వతాలు పిలుపునిచ్చారు. కామ్రేడ్ మారోజు వీరన్న 25వ వర్ధంతి సందర్భంగా ఈనెల 16 నుంచి 30 వరకు గ్రామ గ్రామాన నిర్వహించే సభలను విజయవంతం చేయాలని మంగళవారం స్థానిక రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద కరపత్రాలు ఆవిష్కరించి మాట్లాడారు. మేమెంతమంది మాకు అంత వాటా అనగారిన కులాల అందరిదీ అదే బాట అంటూ మూడు దశాబ్దాల కిందటే మారోజు వీరన్న పోరాటం కొనసాగించాడన్నారు. కులగనన తప్పనిసరి అని చెప్పిన రాజకీయ అంశాలు వర్తమాన రాజకీయాలలో అజెండాగా ఉన్నాయన్నారు. అగ్రవర్ణ అగ్రకుల పాలకవర్గ రాజకీయ ఎత్తుగడలలో భాగంగా ఈ అంశాలు ఎజెండా అయ్యాయని కానీ ప్రత్యామ్ రాజకీయాల నిర్మాణ బాధ్యత కమ్యూనిస్టులు, బహుజనులదే అని గుర్తించాలన్నారు. కేవలం మాక్సిజం అంబేద్కర్ ఇజం ప్రజలను విముక్తి చేయలేవని కులం వర్గం కలగలుచు కొనసాగుతున్న దేశంలో మాక్సిజన్ అంబేద్కర్ ఇజం లను ఈ దేశ ప్రజలు సైదాంతిక ఆయుధాలుగా స్వీకరించాల్సిందే అన్నారు. కర్తవ్య నిర్వహణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మారోజు వీరన్న ఆశయ సాధనకై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 16 నుంచి 30 వరకు నిర్వహించే మారోజు వీరన్న వర్ధంతి సభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బహుజన కార్మిక సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాదల శ్రీనివాస్, బాణాల విజయ్ కుమార్, బహుజన మహాసభ ఉపాధ్యక్షులు మండ్ర మల్లయ్య, బహుజన మహా సభ జిల్లా అధ్యక్షులు బత్తుల వెంకన్న, బహుజన మహాసభ రాష్ట్ర నాయకులు నారగోని వెంకట్ యాదవ్, బాణాల విజయ్,బహుజన మహాసభ ప్రధాన కార్యదర్శి బుడిగం మల్లేష్ యాదవ్, కూలి రాయి సంఘం జిల్లా నాయకులు బొల్లం లింగయ్య, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు అమృ నాయక్ సిపియుఎస్ఐఆర్ఎం ఆర్గనైజింగ్ సెక్రటరీ చామకూరి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.