అల్లరి న‌రేష్ ‘బ‌చ్చల మ‌ల్లి’ గ్లింప్స్‌ టీజ‌ర్‌ విడుద‌ల

నవతెలంగాణ – హైదరాబాద్: టాలీవుడ్ హీరో అల్లరి న‌రేష్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘బ‌చ్చల మ‌ల్లి’. ఈ సినిమాకు సుబ్బు మంగాదేవి దర్శక‌త్వం వ‌హిస్తుండ‌గా.. హాస్యా మూవీస్ పతాకంపై రాజేశ్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని సమకూర్చనున్నాడు. ఇందులో నరేష్ కి జోడీగా అమృత అయ్యర్ కనిపించ‌నుంది. ఇప్పటికే మూవీ నుంచి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌గా.. ఆక‌ట్టుకుంది. ఇదిలావుంటే నేడు అల్లరి న‌రేష్ బ‌ర్త్ డే. ఈ సంద‌ర్భంగా మూవీ నుంచి టీజ‌ర్‌ విడుద‌ల చేశారు మేక‌ర్స్. దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందనివాడు.. సుఖములు కలిగినప్పుడు స్పృహ లేని వాడు.. రాగము, క్రోధము, భయము పోయినవాడు.. అని మహాభారతంలో శ్రీకృష్ణుడి డైలాగ్‌తో ఈ టీజ‌ర్ మొద‌ల‌వుతుంది.

Spread the love