ఇంటర్ లో మెరిసిన ఆలూరు విద్యార్థి

నవతెలంగాణ – ఆర్మూర్
ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలలో ఆలూర్ మండల కేంద్రానికి చెందిన గుర్రం చరణ్ గౌడ్ ప్రతిభ కనపరిచినాడు. తండ్రి సురేందర్ గౌడ్ గత మూడు సంవత్సరాల క్రితం చనిపోగా, తల్లి గీతా మధువాణి కష్టపడి చదివించింది..7 వ తరగతి వరకు మానస హైస్కూల్ లో చదువుకొని,8 వ తరగతి నుండి జక్రాన్ పల్లి మోడల్ స్కూల్ లో చదువును  కొనసాగించారు. గత సంవత్సరం 10 వ తరగతి రిజల్ట్స్ లో మండల స్థాయిలో జీపీఏ 10/10 ర్యాంకు సాధించి, పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ లో 300 లోపు ర్యాంకు సాధించి, టి ఎస్ ఆర్ జె సి  సర్వెల్ లో… బాసర ట్రిపుల్ ఐటీ లో సీట్లు సాధించాడు.ప్రస్తుతం శ్రీ చైతన్య కాలేజ్ హైదరాబాద్ లో ఇంటర్ మొదటి సంవత్సరం రిజల్ట్ లలో 470 కి 466 మార్క్స్ సాధించాడు. చరణ్ గౌడ్ కు ముగ్గురు అక్క చెల్లెండ్లు, పెద్ద అక్క గుర్రం సృజన ప్రసుతము ఆర్గుల్ నందు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గాను  రెండవ అక్క గుర్రం ప్రణవి  ప్రసుతము వెంచిర్యాల్  బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గా పని చేస్తున్నారు. మూడవ అక్క గుర్రం నమరత పాలిటెక్నిక్ పూర్తి చేసుకొని హైదరాబాద్ లో ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చదువుకుంటుంది. ఈ సందర్భంగా మండల స్థాయిలో ఉత్తమ ర్యాంకు సాధించిన చరణ్ గౌడ్ ను స్థానిక నాయకులు ప్రజలు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

Spread the love