అమరావతే ఏపీ రాజధాని: చంద్రబాబు..

నవతెలంగాణ – అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతేనని టీడీపీ అధినేతన నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇకపై మూడు రాజధానులు అంటూ ఆటలాడే పరిస్థితి రాష్ట్రంలో ఉండదని తేల్చి చెప్పారు. విశాఖపట్నంను ఆర్థిక, ఆధునిక రాజధానిగా అభివృద్ధి చేసుకుందామంటూ ఆయన పిలుపునిచ్చారు. ఈమేరకు మంగళవారం విజయవాడలో జరిగిన ఎన్డీయే శాసనసభా పక్ష సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. కూటమి శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రజా తీర్పును గౌరవించి, వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని అన్నారు.

Spread the love