పండగ సంబరాలకు అమేజాన్ పే మరింత ప్రత్యేకం

నవతెలంగాణ న్యూఢిల్లీ: పండగ సంబరాలు పూర్తిగా ఊపందుకోవడంతో, అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2023 గణనీయమైన ఆరంభం చేయడంతో, ఆన్ లైన్ షాపింగ్ కస్టమర్స్ కు సౌకర్యవంతంగా, చవకగా చేయడానికి అమేజాన్ పే ‘రుపే క్రెడిట్ కార్డ్స్ పై ఈఎంఐ’ ని పరిచయం చేసింది. రుపే క్రెడిట్ కార్డ్స్ పై ఈఎంఐ ఎనిమిది ప్రముఖంగా జారీ చేసే బ్యాంక్స్ పై వర్తిస్తుంది. రుపే క్రెడిట్ కార్డ్స్ పై ఈఎంఐతో కస్టమర్స్ పండగ సమయంలో షాపింగ్ ను మరింత చవకగా, సరళంగా చేయవచ్చు. అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ యొక్క మొదటి 48 గంటల సమయంలో, ఈఎంఐలు ఇన్ స్టాల్మెంట్స్ పై 4 షాపింగ్ ఆర్డర్స్ లో 1తో నో కాస్ట్ ఈఎంఐలు పై 4 ఈఎంఐ ఆర్డర్స్ లో 3తో అత్యంత ప్రాధాన్యతనిచ్చే చెల్లింపు విధానంగా అభివృద్ధి చెందాయి. ఈ అభివృద్ధిపై వ్యాఖ్యానిస్తూ, మయాంక్ జైన్, డైరక్టర్ – క్రెడిట్ మరియు లెండింగ్, అమేజాన్ పే ఇండియా ఇలా అన్నారు, “ఎన్ పీసీఐ భాగస్వామంతో రుపే క్రెడిట్ కార్డ్స్ పై ఈఎంఐని పరిచయం చేయడం కస్టమర్స్ క్రెడిట్ కు మెరుగ్గా పొందడానికి, తరగతిలో ఉత్తమమైన విలువను కేటాయించడానికి, ఆదాలు అత్యధికం చేయడానికి అనుమతి ఇస్తుంది.
ఇది భారతదేశంవ్యాప్తంగా కస్టమర్స్ కోసం ప్రత్యేకించి పండగల సమయంలో ఆన్ లైన్ షాపింగ్ యొక్క సౌకర్యాన్ని మరియు సరసమైన ధరలను ప్రోత్సహిస్తుంది. అమేజాన్ పేలో, మేము సౌకర్యవంతమైన, సమీకృతమైన మరియు సరసమైన మరియు బహుమానపూరకమైన డిజిటల్ చెల్లింపును మా కస్టమర్స్ కోసం ఆవిష్కరించి, అందచేయడానికి కట్టుబడ్డాము.” అమేజాన్ పే కస్టమర్స్ కోసం అమేజాన్ పే లేటర్, అమేజాన్ పే వాలెట్, యూపీఐ మొదలైన వంటి సరసమైన, సౌకర్యవంతమైన చెల్లింపు ఆప్షన్స్ సమూహాన్ని అందిస్తోంది. ఇవి నిరంతరంగా, సురక్షితంగా చెల్లింపు అనుభవాన్ని నిర్థారించడమే కాకుండా, కస్టమర్స్ కు తమ ఖర్చులపై ఆకర్షణీయమైన బహుమతులు కూడా అందచేస్తాయి.

Spread the love