వృత్తి నిర్వహణలో చేసే మంచి పనుల వల్లే గుర్తింపు: అంబరీష

నవతెలంగాణ – నెల్లికుదుర
ప్రతి వృత్తి నిర్వహణలో చేసే మంచి పనులే వ్యక్తులకు గుర్తింపుగా నిలుస్తాయని జిల్లా వైద్యాధికారి డాక్టర్ అంబరీష అన్నారు. మండల కేంద్రంలోని సోమవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇటీవల వీడ్కోలు పొందిన ఎన్ సి డి విధులు నిర్వహించిన కస్తూరి విజయలక్ష్మి కి డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ మురళీధర్ తో కలిసి ఆమెకు బొకే ఇచ్చి శాలువ తో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కస్తూరి విజయ ఆరు సంవత్సరాల క్రితం కాంట్రాక్టు పద్ధతుల  ఇక్కడ విధులు నిర్వహించి మంచి ఆదరణ పొందిందని అన్నారు. ఆమెకు ఈ మధ్యకాలంలో ప్రభుత్వం కాంట్రాక్టు పద్ధతి నుండి పర్మినెంట్గా ఉద్యోగం కల్పించడం వల్ల ఆమె వరంగల్ ఎంజీఎం కు వెళ్లిందని అన్నారు. అందుకోసం ఈరోజు వేడుకలు సమావేశాన్ని నిర్వహించామని అన్నారు. రోగులకు ఆమె చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ కష్టాలను పాలుపంచుకుంటూ వెళ్లినందున ఆమెకు శాల తో ఘనంగా సత్కరించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు వృత్తిపట్ల నిబద్దతో క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారులు డాక్టర్ వంశీకృష్ణ డాక్టర్ శారద సిహెచ్ఓ శాంతమ్మ వెంకటేశ్వర్లు సూపర్వైజర్లు మంగమ్మ సుల్తానా రవి మరియు పద్మావతి పద్మారాణి ఏఎన్ఎంలు స్టాప్ సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love