అమ్మ ఆదర్శ పాఠశాల పనులపై సమీక్ష నిర్వహించిన అదనపు కలెక్టర్

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
అమ్మ ఆదర్శ పాఠశాలల పనులపై కాన్ఫరెన్స్ హాల్లో విద్యాశాఖ అధికారులు, పిఆర్ ఇంజనీర్లతో  శుక్రవారం నాడు జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కే గంగాధర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలని, జిల్లాలో 673 ప్రభుత్వ, ఎయిడెడ్, కస్తూరిబా, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలకు 51,848 మంది విద్యార్దినీ విద్యార్ధులకు స్టిచింగ్ కోసం అన్ని మండల కేంద్రాలకు యూనిఫామ్ క్లాత్ పంపించడం జరిగిందని, 541 స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా యూనిఫామ్ డ్రెస్సులు కుట్టించి విద్యార్ధులకు వచ్చే జూన్ 5 లోగా అందించేటట్లు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టిన మౌళిక సదుపాయాల పనులు త్వరగా పూర్తి చేసి అందించాలని తెలిపారు.
Spread the love