చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న ఆదివాసి విద్యార్థి

– బైక్ పై నుండి పడి ఆదివాసి విద్యార్థి అస్వస్థత
– సహాయం చేయాలని కోరుకుంటున్న ఆదివాసి పేద కుటుంబ
నవతెలంగాణ – తాడ్వాయి 

ములుగు జిల్లా తాడ్వాయి మండలం బొల్లెపల్లి గ్రామానికి చెందిన సుతారి భానుప్రకాష్ డిగ్రీ విద్యార్థి, తల్లిదండ్రులు పొట్టయ్య- చంద్రకళ లు కడు పేద కుటుంబానికి చెందిన ఆదివాసి గిరిజన బిడ్డలు గత రాత్రి 8 గంటలకు, మేడారం వెళ్ళివస్తుండగా బైక్ అదుపుతప్పి ఒడ్డుగూడెం దగ్గర ప్రమాదం వాటిని కిందపడ్డాడు. తీవ్ర గాయాలైనాయి, కోమాలో కి వెళ్లిపోయాడు హనుమకొండ, బాలసముద్రం లోని చక్రవర్తి హాస్పటల్లో వైద్యం పొందుతున్నాడు ఈ విద్యార్థికి 15 లక్షలు ఖర్చు అవుతుందని, కావాలని వైద్యులు తెలిపారు, పేద ఆదివాసి విద్యార్థికి ఎవరికి తోచిన్నంత  వారు సహాయం చేయాలని కోరుకుంటున్నారు…ఫోన్ పే/గూగుల్ పే నెంబర్ 6301973317..కు ఆర్థిక సహాయం అందించగలరు.

Spread the love