ఎయిర్‌ ఫోర్స్‌ హెలికాప్టర్‌ అత్యవసర ల్యాండింగ్‌..

– భోపాల్‌లో సేఫ్టీ ల్యాండ్‌
భోపాల్‌ : భారత వాయుసేనకు చెందిన ఏఎల్‌హెచ్‌ ధృవ్‌ హెలికాఫ్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలెట్‌ ముందు జాగ్రత్తగా హెలికాఫ్టర్‌ను భోపాల్‌ సమీపంలోని మైదాన ప్రాంతంలో సేఫ్టీ ల్యాండ్‌ చేశారు. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ (ఐఏఎఫ్‌)కు చెందిన ఎఎల్‌హెచ్‌ 111 హెలికాఫ్టర్‌ రోజువారీ శిక్షణలో భాగంగా భోపాల్‌ నుంచి చకేరికి బయలుదేరింది. అయితే హెలికాఫ్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలెట్‌ అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేద ఐఏఎఫ్‌ వర్గాలు వెల్లడించాయి. హెలికాఫ్టర్‌లో ఉన్న పైలెట్‌లు, ఎయిర్‌ఫోర్స్‌ సిబ్బంది క్షేమంగా ఉన్నారని తెలిపాయి. హెలికాప్టర్‌లో తలెత్తిన సాంకేతిక లోపాన్ని సరి చేసేందుకు ఓ ప్రత్యేక బృందాన్ని ఘటనా ప్రాంతానికి పంపినట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి.

Spread the love