సత్య, యోగి బాబు ప్రధాన పాత్రలలో పవన్ బసంశెట్టి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది.
ఈ ప్రాజెక్ట్‌ను నాగార్జున రెడ్డితో కలిసి పవన్ బసంశెట్టి స్వయంగా నయవాయు చిత్రాలు, డ్రీమ్ మూవీ మేకర్స్ బ్యానర్ల పై నిర్మిస్తున్నారు. ఈ రెండు బ్యానర్లకు ఇది ప్రొడక్షన్ నెం.1. అధికారిక ప్రకటనతో పాటు చిత్ర నిర్మాతలు గ్రాండ్ లాంచ్ ఈవెంట్తో ఈ చిత్రాన్ని ప్రారంభించారు.
రామోజీ ఫిల్మ్ సిటీలో మూవీ టీం, ప్రత్యేక అతిథుల సమక్షంలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్ కిషోర్ తిరుమల క్లాప్ కొట్టారు. దర్శకుడు మహేష్ బాబు పి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకులు యదువంశీ, సందీప్ రాజ్ నిర్మాతలకి స్క్రిప్ట్ అందించారు. సత్య, యోగి బాబులపై కీలక సన్నివేశాల చిత్రీకరణతో సోమవారం నుంచే సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమైంది.
తన తొలి చిత్రం ‘రంగబలి’లో అలరించే రచనతో ప్రశంసలు అందుకున్న దర్శకుడు పవన్ బసంశెట్టి ఇప్పుడు మరో పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రాన్ని అందించడానికి సిద్ధమవుతున్నారు. సత్య, యోగి బాబుల అద్భుతమైన కామెడీ టైమింగ్ ద్వారా ఈ సినిమా వినోదభరితమైన ప్రయాణంగా ఉండనుంది అని మేకర్స్ తెలిపారు.
వినోదభరిత ప్రయాణంమొదలైంది
- Advertisement -
- Advertisement -



