ప్రాధాన్యత సంతరించుకున్న భేటీ
13న అసెంబ్లీలో బలపరీక్ష
చెన్నై: తమిళనాడు కొత్త సీఎం విజయ్ – మాజీ సీఎం ఎంకే స్టాలిన్ తో భేటీ అయ్యారు. టీవీకే చీఫ్ సోమవారం డీఎంకే అధినేత నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక వచ్చిన విజయ్ ను మాజీ సీఎం స్టాలిన్ పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. వారిరువురి మధ్య దేశ, రాష్ట్ర రాజకీయాలపై చర్చ జరిగినట్టు టీవీకే వర్గాలు తెలిపాయి. ఈ భేటీలో మాజీ ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడా పాల్గొన్నారు. రాష్ట్ర ఖజానాను గత డీఎంకే ప్రభుత్వం ఖాళీ చేసిందని ఇప్పటికే విజయ్ ఆరోపించారు. దీనికి స్టాలిన్ కూడా బదులిచ్చారు. అప్పులు పరిమితికి లోబడే ఉన్నాయన్నారు. కోవిడ్ లాంటి విపత్తును ఎదుర్కొని, నిధులు ఇవ్వడంలో అడ్డంకులు సృష్టించిన బీజేపీని తట్టుకుని దీటుగా నిలబడ్డామని తెలిపారు. ఈ నేపథ్యంలో వీరిద్దరు సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
13న బలపరీక్ష
టీవీకే విజయ్ నేతృత్వంలో ఆదివారం తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మే 13న ఈ ప్రభుత్వం అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోనుంది. మరోవైపు నేడు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. నిన్న మంత్రిగా ప్రమాణం చేసిన యువనేత కీర్తన.. నేడు ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయలేకపోయారు. ఎలక్షన్ సర్టిఫికేట్‌ను తీసుకురాకపోవడమే అందుకు కారణం. తర్వాత వెనక్కి వెళ్లిన ఆమె దానిని తీసుకొచ్చి, సమర్పించడంతో ఎట్టకేలకు ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు.
స్టాలిన్ ఇంటికి సీఎం విజయ్
- Advertisement -
- Advertisement -



