Tuesday, May 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంత్వరలో సర్‌ ‌షెడ్యూల్‌

త్వరలో సర్‌ ‌షెడ్యూల్‌

- Advertisement -


రాష్ట్ర వ్యాప్తంగా ఇండ్ల మ్యాపింగ్‌‌ను వేగవంతం చేయండి : జిల్లా కలెక్టర్లకు
రాష్ట్ర ప్రధాన ఎన్నికల
అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశం​
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

తెలంగాణలో త్వరలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్‌) ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఇండ్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్లు, డీఈఓలను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌‌లోని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం నుంచి వారితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎలక్ష‍న్‌ ‌కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (ఈసీఐ) ఆదేశం మేరకు ఈ నెలాఖరులోగా 90 శాతం పురోగతి సాధించాలన్నారు. ఈఆర్ఓఎస్, ఏఈఆర్ఓఎస్, బీఎల్‌ఓ సూపర్‌వైజర్లు బీఎల్‌ఓలతో కలిసి గేటెడ్ కమ్యూనిటీలు, మురికివాడల ప్రతినిధులను భాగస్వాములను చేస్తూ మ్యాపింగ్ కోసం ఆయా ప్రాంతాలను సందర్శించాలన్నారు. ఓటర్లను మ్యాపింగ్ చేయించుకోవడంలో సహాయపడటానికి హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. నియోజకవర్గాల్లో మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయడానికి స్వయం సహాయక బృందాలు, రేషన్ షాపు డీలర్లు, ఉద్యోగ సంఘాలను భాగస్వాములను చేయాలన్నారు. మరణించిన, వలస, శాశ్వతంగా తరలివెళ్లిన ఓటర్లపై దృష్టి సారించి సరిదిద్దడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే తమ నియోజకవర్గాల్లో వీవీఐపీ, వీఐపీ ఓటర్ల మ్యాపింగ్‌ను చేపట్టాలని ఆదేశించారు. ప్రతి బుధవారం ఈఆర్ఓల ద్వారా రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించి, ఎస్ఐఆర్ మ్యాపింగ్ పురోగతిని సమీక్షించాలని ఆదేశించారు. మ్యాపింగ్‌‌కు సంబంధించి అనధికార వ్యక్తులతో ఎలాంటి సమాచారాన్ని గానీ, ఓటీపీలను గానీ పంచుకోవద్దని బీఎల్‌ఓలను హెచ్చరించారు. అలా చేయని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తప్పుడు మ్యాపింగ్‌లు ఎక్కడైనా నమోదైతే వెంటనే సరిదిద్దాలని కోరారు. వీడియో కాన్ఫరెన్స్‌‌లో రాష్ర్ట అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ వాసం వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -