Tuesday, May 12, 2026
E-PAPER
Homeబీజినెస్రూపాయి రికార్డు క్షీణత

రూపాయి రికార్డు క్షీణత

- Advertisement -


ముంబయి : అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌‌లో రూపాయి విలువ రోజు రోజుకు రికార్డ్‌ ‌పతనాన్ని చవి చూస్తోంది. విదేశీ మారకం నిల్వలపై ఒత్తిడి, భారత స్టాక్‌ ‌మార్కెట్ల భారీ పతనం, ద్రవ్యోల్బణ ఆందోళనల నేపథ్యంలో సోమవారం భారీగా కుప్పకూలింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే ఏకంగా 82 పైసలు క్షీణించి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 95.31 వద్ద ముగిసింది. పశ్చిమాసియా శాంతి ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించడం తదనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా స్పందించడంతో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరగడం రూపాయి పతనానికి ప్రధాన కారణంగా నిలిచింది. ఇంటర్‌‌బ్యాంక్‌ ‌ఫారిన్‌ ఎక్సేంజీలో రూపాయి 94.97 వద్ద ప్రారంభమైంది. రోజంతా 94.87 నుండి 95.34 మధ్య ఊగిసలాడి.. చివరకు గత ముగింపు 95.31కి పరిమితమయ్యింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -