1600 మంది విద్యార్థుల ఫిర్యాదులపై నిపుణుల కమిటీ దర్యాప్తు

న్యూఢిల్లీ : 1600 మంది విద్యార్థుల ఫిర్యాదులను హై పవర్డ్‌ నిపుణుల కమిటీ పరిశీ పరిశీలిస్తోందని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజన్సీ (ఎన్‌టిఎ) తెలిపింది. నీట్‌ ప్రశ్నాపత్రం లీక్‌ కాలేదని ఎన్‌టిఎ డైరెక్టర్‌ జనరల్‌ సుభోద్‌ కుమార్‌ పేర్కొన్నారు. నీట్‌ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ వచ్చిన వార్తలపై శనివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నీట్‌ ప్రశ్నాపత్రం లీక్‌ కాలేదని, పేపర్‌ లీకైనట్లు మే 6న వచ్చిన వార్తలను ఖండిస్తున్నామని అన్నారు. నీట్‌ ప్రశ్నాపత్రాలు సోషల్‌ మీడియాలో 4.30 తర్వాత పరీక్ష ప్రారంభమైన రెండు గంటల అనంతరం సాయంత్రం 4.30 గంటల సమయంలో ప్రశ్నాపత్రాలు సోషల్‌ మీడియాలో షేర్‌ అయ్యాయని అన్నారు. పరీక్షల నిర్వహణలో రాజీపడలేదని అన్నారు. సమస్య కేవలం 1600 మంది విద్యార్థులదని, 4,750 పరీక్షా కేంద్రాల్లో ఆరు కేంద్రాల్లో మాత్రమే సమస్య ఎదురైందని అన్నారు. యుపిఎస్‌సి మాజీ చైర్‌పర్సన్‌ ఆధ్వర్యంలోని కొత్త కమిటీ కాంపన్సేటరీ మార్క్స్‌, సమయం కోల్పోయిన విద్యార్థుల సమస్యలను పరిశీలిస్తుందని అన్నారు. కమిటీ సిఫారసు మేరకు ఎన్‌టిఎ తగిన సమయంలో నివేదికను సమర్పిస్తుందని అన్నారు. కౌన్సిలింగ్‌, అడ్మిషన్‌ ప్రక్రియ ప్రభావితం కాదని అన్నారు. దేశవ్యాప్తంగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని, పోలీసులకు సహకరిస్తామని అన్నారు. సమయం నష్టం, సమాధానమిచ్చిన ప్రశ్నల ఆధారంగా గ్రేస్‌ మార్కుల విధానం ఆధారపడి ఉంటుందని సుభోద్‌ కుమార్‌ తెలిపారు. గరిష్టంగా 720, అత్యల్పంగా -20 అని, ఇది అభ్యర్థులపై ఆధారపడి ఉంటుం దని అన్నారు. 1600 మంది విద్యార్థుల సమస్యను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఫలితాలను పున:పరిశీలించాలని కోరుతూ 2,000 మంది విద్యార్థుల సంతకాలతో ఓ పిటిషన్‌ను దాఖలైన సంగతి తెలిసిందే. హై కటాఫ్‌ మార్క్స్‌ ఉన్నాయని, ఎక్కువ మందికి ఫుల్‌ స్కోర్‌ వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. 67మంది విద్యార్థులు 720/720 మార్క్స్‌ సాధించారని, దీనిపై అనుమానాలు ఉన్నాయని, ఇలా ఎప్పుడూ జరగలేదని పేర్కొన్నారు. సాధారణంగా ముగ్గురు లేదా నలుగురికి మాత్రమే ఫుల్‌ స్కోర్‌ వస్తుందని తెలిపారు.

Spread the love