ఎన్నికల కమిషనర్‌గా తొలి మహిళ రమాదేవి

న్ఎన్నికల కమిషనర్‌గా తొలి మహిళ రమాదేవియూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పడినప్పటి నుంచీ ఇప్పటివరకూ 25 మంది చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్లుగా పనిచేశారు. వీరిలో ఒక్కరే మహిళ కావడం విశేషం. ఆమె పేరు వి.ఎస్‌.రమాదేవి. ఆమె తెలుగు మహిళ కావడం విశేషం. అయితే రమాదేవి ఎలక్షన్‌ కమిషనర్‌గా కేవలం 16 రోజులే పనిచేశారు. 1990 నవంబర్‌ 26వ తేదీన సిఇసిగా బాధ్యతలు చేపట్టారు. 16 రోజుల అనంతరం పదవీవిరమణ చేశారు. అనరరంతరం హిమాచల్‌ప్రదేశ్‌, కర్ణాటక గవర్నర్‌గా చేశారు. కర్ణాటకకు తొలి మహిళా గవర్నర్‌గా కూడా రమాదేవి రికార్డు నెలకొల్పారు. సిఇసి కాకమునుపు కేంద్ర న్యాయశాఖ స్పెషల్‌ సెక్రటరీగా, లా కమిషన్‌ మెంబర్‌ సెక్రటరీగా, రాజ్యసభ సెక్రటరీ జనరల్‌గా పలు హోదాల్లో పనిచేశారు.

Spread the love