భీం ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ పై కాల్పుల ఘటనపై విచారణ జరపాలి

నవతెలంగాణ- కంటేశ్వర్
భీం ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ పై ఉత్తర ప్రదేశ్ లోని సహారాన్ పూర్ లో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి పారిపోయారు.పారిపోయిన వారు ఉపయోగించిన వాహనం గుర్తింపు ఆధారంగా నిందితులను పోలీసులు దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని బిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ రోడ్లు భవనాల అతిథి గృహంలో భీం ఆర్మీ జరిగిన కార్యకర్తల సమావేశంలో దండి వెంకట్ మాట్లాడుతూ.. ఉత్తర ప్రదేశ్ లో దళితుల పై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న భీం ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ పై దాడి వెనుక ఆధిపత్య కులోన్మాదులే ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భీం ఆర్మీ జిల్లా అద్యక్షులు సంజీవ్ ససానే , రాహుల్ ససానే, బిఎల్ఎఫ్ జిల్లా కన్వీనర్ కాంబ్లీ మధు, బౌద్ధ సొసైటీ రాష్ట్ర నాయకులు అశోక్ భాగ్య వన్, భీం ఆర్మీ నాయకులు సంజీవ్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love