Monday, August 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం‌నాసిరకం యూనిఫారాలపై విచారణ జరపాలి

‌నాసిరకం యూనిఫారాలపై విచారణ జరపాలి

- Advertisement -

మాజీమంత్రి హరీశ్‌‌రావు డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

‌నాసిరకం యూనిఫారాల పంపిణీపై విచారణ జరపాలని బీఆర్‌‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి టి హరీశ్‌‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. మాట్లాడితే ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థ అనే సీఎం రేవంత్‌‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కనీసం నాణ్యమైన యూనిఫారాలు ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారా?అని ప్రశ్నించారు. విద్యార్థులకు నాసిరకం యూనిఫారాల పంపిణీపై హరీశ్‌‌రావు ఆదివారం ఎక్స్‌ ‌ద్వారా స్పందించారు. ఇదేనా అంతర్జాతీయ ప్రమాణాలు రేవంత్ రెడ్డి?అని అడిగారు. ఒకచోట యూనిఫారాలు అందలేదనీ, అందినచోట కొలతలు సరిగ్గా లేవనీ, కుట్లు ఊడిపోతున్నాయని తెలిపారు. ఉతికితే రంగులు వెలిసిపోతున్నాయనీ, రెండు జతలు ఇవ్వాల్సి ఉండగా, చాలా చోట్ల ఒక్క జత కూడా పూర్తిగా అందలేదని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి గుజరాత్ దళారులపై ఉన్న ప్రేమ తెలంగాణ చేనేత కార్మికులపై లేదని తెలిపారు. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేలా స్థానికంగా యూనిఫారాల తయారీకి ప్రాధాన్యత ఇవ్వాల్సింది పోయి కమీషన్ల కోసం బడా కార్పొరేట్ల నుంచి నాసిరకం యూనిఫారాలు తెప్పించి విద్యార్థులకు, చేనేత కార్మికులకు అన్యాయం చేశారని విమర్శించారు. “మఫత్‌లాల్ ముద్దు.. చేనేత వద్దు” అన్నదే ప్రభుత్వ వైఖరిగా మారిందా?అని ప్రశ్నించారు. చేనేత కార్మికుల ఉపాధికి గండి విద్యార్థులకు నాసిరకం యూనిఫారాలు అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -