వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామానికి చెందిన తుపాకుల పర్శరాములు(68) వ్యవసాయ పొలం వద్ద, బావి మోటార్ ను, భావిలో నుండి బయటకు తీసే క్రమంలో బావిలో పడి మృతి చెందినట్లు స్థానికులు మాట్లాడుకుంటున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది బావిలో పడిన పరశురాములు మృతదేహం కొరకు గాలింపు చర్యలు చేపట్టారు, అతి కష్టం మీద మృతదేహాన్ని బావిలో నుండి బయటకు తీశారు. మృతునికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుర్లు ఉన్నట్టుగా స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ పోలీసులు వెల్లడించారు.