గుర్తు తెలియని శవం లాభ్యం

నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని బోర్గం (కే) గ్రామ శివారులోని చెరువులో గుర్తు తెలియని శవం లభ్యమైనట్లు ఎస్సై సుదీర్ రావు సోమవారం తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం మండలంలోని బోర్గం (కే) గ్రామంలోని చెరువులో గుర్తు తెలియని శవం తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారాన్నరు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. చనిపోయిన వ్యక్తి మగ మనిషి అని, వ్యక్తి లైట్ నలుపు కలర్ జీన్స్ ప్యాంటు, నలుపు రంగు ఫుల్ హాండ్స్ టీషర్ట్స్ ధరించి ఉన్నాడు. వయసు సుమారు 35-40 సంవత్సరాలు ఉంటుందని, ముఖం గుర్తుపట్టుటకు లేకుండా ఉన్నదని, తల వెంట్రుకలు, గడ్డం తెలుగు రంగులో ఉన్నదని, ఎత్తు సుమారు 5.7 ఫీట్లు ఉన్నడని తెలిపారు. కావున మృతదేహానికి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే మాక్లూర్ పోలీస్ స్టేషన్ ని సంప్రదించాలని అన్నారు. స్థానిక కార్పొరేటర్ రాయ్ సింగ్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Spread the love