ఘనంగా శివాజీ జయంతి

నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని పలు గ్రామాల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఘనంగా సోమవారం నిర్వహించారు. మండల కేంద్రంలో శివాజీ విగ్రహానికి పూల మాలలు వేసి, స్వీట్లు పంచుకున్నారు, విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. యువకులు డీజే ఏర్పాటు చేసి నృత్యాలు చేశారు. అనంతరం గ్రామంలోని ప్రధాన విడుల గుండా బైక్ ర్యాలీతో శోభాయాత్ర చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ సర్పంచ్ అశోక్ కుమార్, ఎంపిటిసి వెంకటేశ్వర్ రావు, తిరుమల నర్సగౌడ్,దర్గాల సాయిలు, గాంధీ గౌడ్, హన్మ గౌడ్, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Spread the love