బుజ్జిని డ్రైవ్ చేసిన ఆనంద్ మహీంద్ర..

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లలో ‘కల్కి 2898ఏడీ’ ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఒక వాహనాన్ని రూపొందించారు. దానికి ‘బుజ్జి’ అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఈ వాహనం సినిమా ప్రమోషన్లలో సందడి చేస్తోంది. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా బుజ్జిని డ్రైవ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

Spread the love