Tuesday, July 21, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంబ్రిటన్ కొత్త ప్రధానిగా యాండీ బర్న్‌హామ్

బ్రిటన్ కొత్త ప్రధానిగా యాండీ బర్న్‌హామ్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : యునైటెడ్ కింగ్‌డమ్ నూతన ప్రధానమంత్రిగా లేబర్ పార్టీ సీనియర్ నేత యాండీ బర్న్‌హామ్ నిన్న అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో రాజు చార్లెస్ IIIతో భేటీ అయిన అనంతరం ఆయన ప్రధానిగా నియమితులయ్యారు. గత దశాబ్ద కాలంలో బ్రిటన్‌కు ఏడవ ప్రధానిగా యాండీ బర్న్‌హామ్ బాధ్యతలు స్వీకరించడం గమనార్హం. గత రెండేళ్లుగా ప్రధానిగా విధులు నిర్వహించిన కీర్ స్టార్మర్ పదవి నుంచి వైదొలగడంతో ఈ మార్పు చోటుచేసుకుంది. గత వారం జరిగిన లేబర్ పార్టీ అంతర్గత ఎన్నికల్లో, పార్టీ పార్లమెంటు సభ్యుల పూర్తి మద్దతుతో బర్న్‌హామ్ ఏకగ్రీవంగా నాయకుడిగా ఎన్నికయ్యారు. దీంతో సాధారణ ఎన్నికల అవసరం లేకుండానే అధికార మార్పిడి ప్రక్రియ పూర్తయింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -