Tuesday, June 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎన్ హెచ్ టి ఎస్, పోషణ ట్రాకర్ యాప్ పై అంగన్వాడీలకు అవగాహన

ఎన్ హెచ్ టి ఎస్, పోషణ ట్రాకర్ యాప్ పై అంగన్వాడీలకు అవగాహన

- Advertisement -

అమ్మమాట-అంగన్వాడి బాటపై పిల్లల నమోదు పెంచాలి
నవతెలంగాణ-మద్నూర్

మద్నూర్ ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని మద్నూర్, డోంగ్లి, బిచ్కుంద, జుక్కల్, పెద్ద కొడప్గల్, మండలాల అంగన్వాడీ టీచర్లకు మంగళవారం మద్నూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎన్ హెచ్ టి ఎస్, పోషణ ట్రాకర్ యాప్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అలాగే అమ్మ మాట అంగనివడి బాట కార్యక్రమంలో భాగంగా పిల్లల సంఖ్య పెంపుపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ఈ ప్రాజెక్టు సమావేశానికి ఐసిడిఎస్ సిడిపిఓ అందుబాటులో లేకపోవడం ఈ సమావేశంలో మద్నూర్ సూపర్వైజర్ దేవకరణ, పెద్ద కొడప్గల్ సూపర్వైజర్ నసీమా, పోషణ అభియాన్ బ్యాంక్ కోఆర్డినేటర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లందరూ లబ్ధిదారుల నమోదు ఎన్ హెచ్ టి ఎస్ మరియు పోషణ ట్రాకర్ యాప్ లో సమానంగా నమోదు చేయాలని సూచించడం జరిగింది. అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమాల ద్వారా పిల్లల నమోదు పెంచాలని సూచించడం జరిగింది. వర్షాకాలం ఉన్నందున  అంగన్వాడీ టీచర్లందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేయడం జరిగింది. అంగన్వాడి సరుకులు పాడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. అంగన్వాడి కేంద్రాలలో పోషణ వాటిక పెట్టుకోవడం  గురించి కూడా చెప్పడం జరిగింది. అంగన్వాడి కేంద్రాలలో ఖాళీ స్థలం ఉన్న అంగన్వాడి టీచర్లందరూ పోషణ వాటిక నిర్వహణ చేయాలని సూచించారు.  అంగన్వాడి కేంద్రాలన్నీ సంబంధిత లైన్మెన్ గారికి సంప్రదించి సొంత మీటర్ తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో బిచ్కుంద, జుక్కల్, మద్నూర్ ,డోంగ్లి, పెద్ద కొడప్గల్. మండల అంగన్వాడీ టీచర్లు అందరూ పాల్గొనడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -