నవతెలంగాణ-నసురుల్లాబాద్
మండలంలో అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను బుదవారం నసురుల్లాబాద్ తహసిల్దార్ కార్యాలయంలో వేలం వేయనున్నట్లు తహసీల్దార్ సువర్ణ ఓ ప్రకటనలో తెలిపారు. బాన్సువాడ రెవెన్యూ డివిజనల్ అధికారి ఆదేశాల మేరకు సంగెం గ్రామ శివారులో అక్రమంగా డంప్ చేసిన ఇసుకను రెవెన్యూ అధికారులు గుర్తించి సీజ్ చేశారు. మండల గిర్దావర్, వేంకట స్వామి గ్రామ పాలనా అధికారి అహ్మద్ సమక్షంలో పంచనామా నిర్వహించి సుమారు 25 ట్రాక్టర్ల ఇసుకను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నారు.
ఈ ఇసుకను జూన్ 24, 2026న ఉదయం 11 గంటలకు నసురుల్లాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్లు అధికారులు తెలిపారు. వేలంపాటలో పాల్గొనదలిచిన ఆసక్తిగల వ్యక్తులు అదే రోజు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్య తమ పేర్లను తహసీల్దార్ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని సూచించారు.
వేలంపాట ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించబడుతుందని, నిబంధనల ప్రకారం అత్యధిక ధర కోట్ చేసిన వారికి ఇసుక కేటాయించబడుతుందని అధికారులు వెల్లడించారు. అక్రమ ఇసుక తవ్వకాలు, నిల్వలపై రెవెన్యూ శాఖ కఠిన చర్యలు కొనసాగిస్తోందని తెలిపారు.



