కేజీ కేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవి రమణ
నవతెలంగాణ-నెల్లికుదురు
ప్రభుత్వం గౌడ్ అన్నలకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని కేజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం వి రమణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. సోమవారం మండల కేంద్రంలో అమరుల యాదిలో గీతన్నల చైతన్య యాత్రలో భాగంగా శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలవేసి అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక సంఘానికి పోరాటం చేసిన అమరుడు పెరుమాండ్ల జగన్నాథం కుమారుడు అయిన పెరుమాండ్ల తిలక్ బాబును శాలువాతో ఘనంగా సత్కరించి సత్కరించి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. గౌడ కులస్తులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో గీతా కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రణాళికలు ప్రకటించిన విధంగా పెన్షన్ 4000 రూపాయలు ఎక్స్గ్రేషన్ 10 లక్షలు పెంచి పెండింగ్లో ఉన్న ఎక్సిబిషన్ డబ్బులు 20 కోట్ల రూపాయలను వెంటనే సంబంధిత బాధితులకు అందజేయాలని మృతి చేసే వారందరికీ కాటమయ్య రక్షణ కవచాలు ఇవ్వాలని ప్రభుత్వ జీవో ప్రకారం 50 సంవత్సరాల పైబడిన గీతా కార్మికులందరికీ పెన్షన్లు వెంటనే అందజేయాలని అన్నారు.
చైతన్య యాత్ర రెండవ తేదీన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రారంభమై 18వ తేదీ వరకు హైదరాబాదులోని ట్యాంక్ బండ్ హైదరాబాదుకు చేరుకుంటారని తెలిపారు. గీతా కార్మికుల హక్కుల పరిష్కారం కోసం పోరాటాలు తప్పవని అన్నారు. గీతా కార్మికులంతా ఐక్యత నుండి హక్కు ల కోసం పోరాడల్సిన అవసరం ఉందని అన్నారు . ఈనెల 18వ తేదీ లోపు ప్రభుత్వం అధికారికంగా సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండపై ఏర్పాటు చేయకపోతే అదే రోజు వేలాది గౌడ సంఘం కులస్తులతో కలిసి విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేజీ కేస్ జిల్లా అధ్యక్షుడు గౌని వెంకన్న ప్రధాన కార్యదర్శి యమ గాని వెంకన్న మండల కేజీ కేఎస్ అధ్యక్షుడు విరగాని మల్లేశం గౌడ్ ప్రధాన కార్యదర్శి శీలం సత్యనారాయణ బందారపు సుధాకర్,పేరుమాండ్ల చంద్రమౌళి, వెంకన్న, రాజు, లక్ష్మణ్ ,యాకయ్య ,సమ్మయ్య ,లింగమూర్తి, శంకర్ , యుగేందర్ ,వెంకట రాములు, రాము ,వివిధ గ్రామాల కల్లుగీత కార్మిక సంఘం నాయకులు సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.



