Saturday, May 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్న అనిల్ రెడ్డి

ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్న అనిల్ రెడ్డి

- Advertisement -

– మాజీ ఉపసర్పంచ్ యాదయ్య
నవతెలంగాణ – ఊరుకొండ 

అనారోగ్యంతో బాధపడుతూ అర్ధాంతరంగా మృతి చెందిన బాధిత కుటుంబాలకు తన వంతు సహాయ సహకారాలు అందించి ఆదుకుంటున్న జననేత, జకినాలపల్లి మాజీ సర్పంచ్ తలసాని అనిల్ రెడ్డి అని మాజీ ఉపసర్పంచ్ యాదయ్య, కాంగ్రెస్ నాయకులు అన్నారు. శనివారం ఊరుకొండ మండల కేంద్రానికి చెందిన కంఠం నర్సమ్మ(55) అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. స్థానిక కాంగ్రెస్ నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న జకినాలపల్లి మాజీ సర్పంచ్ తలసాని అనిల్ రెడ్డి తక్షణమే స్పందించి బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా 5వేల ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఉపసర్పంచ్ కంఠం యాదయ్య, బండి భాస్కర్, బిజెపి నాయకులు సందీప్, (మున్నా ), టిఏఆర్ యువసేన సభ్యులు కంఠం పరంజ్యోతి, కంఠం తిరుపతయ్య, కంఠం అరుణ్ కుమార్, కంఠం ప్రమోద్ కుమార్, కంఠం ప్రవీణ్ కుమార్  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -