బక్రీద్‌కు జంతువధ నిషేధం అర్థరహితం: హైకోర్టు

నవతెలంగాణ-హైదరాబాద్ : మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో విశాల్‌గఢ్ కోట వద్ద బక్రీద్‌కు జంతువధను ఆ రాష్ట్ర సర్కారు నిషేధించడాన్ని బాంబే హైకోర్టు తప్పుబట్టింది. ఆ నిర్ణయం అర్థరహితమైనదని తేల్చిచెప్పింది. కోట రక్షిత కట్టడాల జాబితాలోకి వస్తుందని ప్రభుత్వం తరఫు లాయర్లు వాదించగా.. మరి ఇన్నేళ్లూ ఏం చేశారంటూ ప్రశ్నించింది. ముస్లింలు బహిరంగంగా కాక.. ప్రైవేటు భూముల్లో యథేచ్ఛగా పండుగ చేసుకోవచ్చని తీర్పునిచ్చింది.

Spread the love