Thursday, May 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అన్నదాత విద్యుత్ ప్రదాత సౌరశక్తిపై అవగాహన

అన్నదాత విద్యుత్ ప్రదాత సౌరశక్తిపై అవగాహన

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులకు అర్హులైన లబ్ధిదారుల ప్రయోజనం కోసం పీఎం కుసుం కంపోనేట్ ఏ పథకాన్ని అమలుపరుస్తుందని, బొగ్గు డీజిల్ వాడకాన్ని తగ్గించి సౌరశక్తి వైపు వెళ్లడం మనం కాలుష్య రహిత సమాజాన్ని నిర్మించుకోవచ్చు అని మద్నూర్ ట్రాన్స్కో ఎ ఈ గోపికృష్ణ వ్యవసాయ రైతులకు మండల ప్రజలకు తెలియజేశారు, రైతు వేదిక లో గురువారం అన్నదాత విద్యుత్ ప్రదాత సౌర శక్తి పథకం గురించి అవగాహన కల్పించారు సౌరశక్తి ఏర్పాటు చేసుకుంటే దాని ద్వారా ఎలాంటి లాభాలు ఉన్నాయని దానిపై వివరంగా తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దరాస్ సాయిలు, చిన్న ఎక్లార సర్పంచ్ మాధవరావు, మద్నూర్ గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్, షేకాపూర్ సర్పంచ్ తుకారం, దన్నూర్ సర్పంచ్ జయశ్రీ దేవిదాస్ పటేల్ ,గోజే గావ్ సర్పంచ్ భారత్ రాథోడ్, అవల్గావ్ గ్రామ సర్పంచ్, చిన్న శకర్గా గ్రామ సర్పంచ్ దిగంబర్, చిన్న తడగూర్ గ్రామ సర్పంచ్ సూర్య వంశీ ప్రకాష్, సోముర్ సర్పంచ్ సంగ్రామ్ పటేల్, వ్యవసాయ శాఖ వివిధ క్లాస్టర్ల ఏ ఈ ఓ లు మండల వ్యవసాయ రైతులు ట్రాన్స్కో అధికారులు పాల్గొన్నారు .

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -