- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా రెండవసారి ఎన్నికైన ధరాస్ సాయిలుకు గురువారం మండలంలోని చిన్న ఎక్లారా గ్రామ సర్పంచ్ మాధవరావు, అవల్గావ్ గ్రామ సర్పంచ్ కుమారుడు, కలిసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఇరు గ్రామాల సర్పంచులు మాట్లాడుతూ..మీ పనితీరు కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ గుర్తించి రెండోసారి మండల పార్టీ అధ్యక్షునిగా ఎన్నిక చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండలంలోని దన్నూరు గ్రామ సర్పంచ్ జయశ్రీ, కుటుంబ సభ్యులు దేవిదాస్ పటేల్ పాల్గొన్నారు. సన్మానించిన సర్పంచులకు మండల పార్టీ అధ్యక్షులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
- Advertisement -



