నందికొండ చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన అన్నపూర్ణ

నవతెలంగాణ నాగార్జునసాగర్: నందికొండ మున్సిపాలిటీ నూతన ఛైర్మన్​గా తిరుమలకొండ అన్నపూర్ణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ నందికొండ మున్సిపాలిటీలో తాగునీటి, డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.మున్సిపాలిటీని అన్నివిధాల అభివృద్ధి చేస్తామన్నారు.ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని.. నందికొండ పట్టణాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. అనంతరం నూతన చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన ఆమెకు కౌన్సిలర్లు,కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఆదాసు నాగరాణి విక్రమ్, కౌన్సిలర్లు ఈర్ల రామకృష్ణ,తిరుమలకొండ మోహన్ రావు,మంగత నాయక్,శిరీష మోహన్ నాయక్,రమేష్ జి,కాంగ్రెస్ నాయకులు రంగారెడ్డి,నాగరాజు,రమావత్ మోహన్ నాయక్,కొండ,చిన్ని,రంగ నాయక్,ఆదాసు విక్రమ్,శంకర్,జంగయ్య,సుమన్ మరియు నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.

Spread the love