
మండల కేంద్రంలోని అయ్యప్పస్వామి ఆలయంలో 11 వ వార్షికోత్సవ వేడుకలు సేవాసమితి సభ్యులు శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రాకేష్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి పంచ ద్రవ్యాలతో అభిషేక పూజ,మహా హోమం నిర్వహించారు.ఏర్గట్ల గ్రామానికి చెందిన జుంగల గంగారాం 5016 రూపాయలు విరాళంగా ఇవ్వడంతో అన్నదానం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అయ్యప్పస్వామి సేవాసమితి సభ్యులు మగ్గిడి వెంకటేష్ గౌడ్,భక్తులు పాల్గొన్నారు.