రెండో సెషన్ ప్రారంభంలోనే ఆసీస్‌కు మరో షాక్

నవతెలంగాణ – లండన్: ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ డే-1లో భాగంగా భోజన విరామం అనంతరం రెండో సెషన్ ప్రారంభమైంది. రెండో సెషన్ ప్రారంభంలోనే ఆస్ట్రేలియా జట్టుకు భారత బౌలర్ షమీ షాక్ ఇచ్చాడు. షమీ బౌలింగ్‌లో మార్నస్ లాబుషేన్ బౌల్డ్ అయ్యాడు. మార్నస్ లాబుషేన్ 62 బంతుల్లో 26 పరుగులు చేశాడు. 24.1 ఓవర్ల వద్ద ఆస్ట్రేలియా 76 పరుగులు చేసి మూడో వికెట్ కోల్పోయింది. భోజన విరామం సమయానికి 23 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా జట్టు 73 పరుగులు చేసింది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023 మ్యాచ్‌ ఓవల్ మైదానంలో ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య జరుగుతోంది. భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో ఆస్ట్రేలియా బ్యాటింగ్‌కు దిగింది. 60 బంతుల్లో డేవిడ్ వార్నర్ 43 పరుగులు చేశాడు. ఠాకూర్ బౌలింగ్‌లో శ్రీకర్ భరత్‌కు క్యాచ్ ఇచ్చి వార్నర్ ఔటయ్యాడు. ఉస్మాన్ ఖవాజా 10 బంతులు ఆడి పరుగులు రాబట్టకపోగా.. సిరాజ్ బౌలింగ్‌లో శ్రీకర్ భరత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

Spread the love