టీమ్‌ఇండియాకు భారీ జరిమానా…

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ పోరులో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న టీమ్‌ఇండియాకు మరో షాక్‌ తగిలింది. స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా భారత జట్టుకు ఐసీసీ భారీ జరిమానా విధించింది. రోహిత్‌ సేన మొత్తానికి మ్యాచ్‌ ఫీజులో 100శాతం కోత విధిస్తున్నట్లు వెల్లడించింది. అటు టైటిల్‌ గెలిచిన ఆస్ట్రేలియాకూ జరిమానా తప్పలేదు. స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా ఆసీస్‌ జట్టుకు వారి మ్యాచ్‌ ఫీజులో 80శాతం కోత విధించింది. ఈ మేరకు ఐసీసీ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. నిర్ణీత సమయంలో భారత్‌ 5 ఓవర్లు, ఆస్ట్రేలియా 4 ఓవర్లు తక్కువగా బౌలింగ్‌ చేశాయని ఐసీసీ తెలిపింది.

Spread the love