నవతెలంగాణ – ఆర్మూర్
నియోజకవర్గ ఇంచార్జి ఆశన్నగారి రాజేశ్వర్ రెడ్డి పుట్టిన రోజు సందర్బంగా సోమవారం పట్టణములోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం సిద్ధుల గుట్టపై నెలకొన్న స్వయంభూ శివలింగం వద్ద భారాస సీనియర్ నాయకులు ఖాందేష్ శ్రీనివాస్ – కౌన్సిలర్ సంగీతా ఖాందేష్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. పురోహితుల ఆధ్వర్యములో నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని కోరినారు ఈ కార్యక్రమములో మాజీ కౌన్సిలర్ వన్నెలదేవి లత, భారాస నాయకులు వన్నెలదేవి రాము, మీరా శ్రావణ్, ఖాందేష్ సత్యం, అభిలాష్, చింటూ, మురళి కృష్ణ, నరేందర్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.