దివ్యాంగుడికి రూ.3లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన ఏపీ సీఎం..

నవతెలంగాణ – అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు వచ్చారు. అక్కడ వివిధ వర్గాల ప్రజలను కలుసుకుని వారి సమస్యలు తెలుసుకున్నారు. తాజాగా, కడప రాజారెడ్డి వీధికి చెందిన దివ్యాంగుడు కనపర్తి మనోజ్ కుమార్  వైద్యం కోసం సాయం చేయాలని సీఎం చంద్రబాబును అర్థించాడు. ఈ నేపథ్యలో వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు రూ.3 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు.

Spread the love