ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ పోస్టర్ ఆవిష్కరించిన ఏపీ సీఎం చంద్రబాబు

నవతెలంగాణ -అమరావతి : రాఘవి మీడియా సంస్థ కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ పేరిట కొన్నాళ్లుగా సినీ రంగంలోని వివిధ రంగాల ప్రతిభావంతులకు పురస్కారాలు అందజేస్తోన్న విషయం తెలిసిందే. ఈసారి జూన్ 29న సాయంత్రం 6 గంటలకు హైదరాబాదులోని దసపల్లా హోటల్ లో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డుల ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ పోస్టర్ ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు ఆవిష్కరించారు. ఇవాళ అమరావతిలో సీఎం చంద్రబాబును రాఘవి మీడియా ప్రతినిధులు కలిశారు. కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ గురించి ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వారిని అభినందించి.. పోస్టర్ ను విడుదల చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు.

Spread the love