మహిళా గురుకుల డిగ్రీ కళాశాల ప్రవేశాల కోసం దరఖాస్తులకు ఆహ్వానం

నవతెలంగాణ – ఆర్మూర్  
తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళ గురుకుల డిగ్రీ కళాశాల యందు ప్రథమ సంవత్సరం విద్యార్థినిలు కోసం తక్షణ ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ జి ధనవేణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పాసైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని, విద్యార్థినులు ఎస్ఎస్సి మేమో, ఇంటర్ మేమో, టిసి, కుల, ఆదాయ బోనాఫైడ్ ధ్రువీకరణ పత్రాలు తీసుకొని కళాశాలకు రావాలని కోరినారు.
Spread the love