కిసాన్ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి

– మండల పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రాజశేఖర్ రావు
 నవతెలంగాణ- కమ్మర్ పల్లి  

మండలంలోని అన్ని గ్రామాల రైతులు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో కేసీసీ (కిసాన్ క్రెడిట్ కార్డు )కోసం దరఖాస్తు చేసుకోవాలని మండల పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్.రాజశేఖర్ రావు బుధవారం తెలిపారు. గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలు పోషణ కొరకు ఈ పథకంలో రూ.లక్ష 60వేల వరకు షూరిటీ  లేకుండా  లోను ఇవ్వడం జరుగుతుందన్నారు. అంత కంటే ఎక్కువ మొత్తం కావాలనుకుంటే షూరిటీ  అవసరం ఉంటుందని తెలిపారు. దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి ఉన్న రైతులు మండల పశు వైద్య కార్యాలయంలో దరఖాస్తు ఫారాలు  అందుబాటులో ఉన్నాయన్నారు. అదేవిధంగా పంజాబ్ నేషనల్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యుసిఓ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, కెనరా బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తెలంగాణ గ్రామీణ బ్యాంకు, లలో ఖాతా కలిగిన వారు అర్హులని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Spread the love