ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డులకు దరఖాస్తు చేసుకోండీ..

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
వివిధ రంగాలలో ప్రతిభ చాటిన బాల బాలికలకు 2024వ సం.లో అంధిచనున్న ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డులకు జులై 31, 2024 లోగా ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారి, మహిళా, శిశు, వికలాంగుల & వయోవృద్దుల శాఖ అధికారి వి.వెంకటరమణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.అవార్డ్ కు మెడల్, సర్టిఫికేట్ ఇతర గిఫ్ట్ లు ఉంటాయి అని, ఈ అవార్డుల కోసం 05 నుంచి 18 ఏళ్లలో గా ఉన్నవారు అర్హులని తెలిపారు. ఇన్నోవేషన్, సోషల్ సర్విస్, ధైర్య సహసాలు, పాండిత్యం, క్రీడలు, కళలు, సాoస్కృతిక కళలు వంటి సేవ రంగాలో ప్రావీణ్యం కలిగి ఉండాలన్నారు. ఆన్ లైన్ లో నేషనల్ అవార్డు పోర్టల్ (https://awards.gov.in/) దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న తరువాత సంభందిత పత్రాలను సంక్షేమ శాఖ కలెక్టరేట్, సూర్యపేట కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు.
Spread the love