పోలింగ్ బూత్ లో వాగ్వివాదం..

– పోలీస్ స్టేషన్ కి వివాదం..

– నిరసన చేపట్టిన తాటి..
నవతెలంగాణ – అశ్వారావుపేట
పోలింగ్ బూత్ లో జరిగిన వాగ్వివాదం చిలికి చిలికి గాలి వానలా మారి పోలీస్ స్టేషన్ కు చేరింది.అకారణంగా తమ కార్యకర్తను పోలీస్ స్టేషన్ కు పిలిపించి పోలీస్ లతో కొట్టి స్తారా అంటూ మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మంగళవారం పోలీస్ స్టేషన్ ముందు నిరసన చేపట్టారు. పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలు సందర్భంగా సోమవారం జరిగిన పోలింగ్ లో మండలంలోని అనంతారం పోలింగ్ బూత్ లో కాంగ్రెస్ కార్యకర్త సూరిబాబు సెల్ ఫోన్ తో ప్రవేశించాడు అని టీఆర్ఎస్ కార్యకర్త నవీన్ బాబు అభ్యంతరం తెలిపాడు.ఈ వాగ్వివాదం కాస్తా ముదిరి గొడవకు దారితీసింది.స్పందించిన పోలీస్ సిబ్బంది చెదరగొట్టారు. అనంతరం టీఆర్ఎస్ కార్యకర్త నవీన్ నా పై దురుసుగా ప్రవర్తించడమే కాక అసభ్యకరంగా మాట్లాడింది కాంగ్రెస్ కార్యకర్త  సూరిబాబు పిర్యాదు చేసాడు.దీంతో విచారించడానికి మంగళవారం నవీన్ పోలీస్ లు పిలిపించి కొట్టారని నవీన్ పార్టీ శ్రేణులకు సమాచారం ఇవ్వడంతో సమాచారం తెలుసుకున్న టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు పోలీస్ స్టేషన్ కు చేరుకుని నిరసన చేపట్టారు.రోడ్డు పై బైఠాయించి ఆందోళన చేపట్టడంతో రాకపోకలు నిలిచిపోయాయి.కొద్ది సేపటి తర్వాత ‌సీఐ జితేందర్ రెడ్డి తో చర్చించారు. ఇరువురి పిర్యాదులు విచారిస్తున్నాను : సీఐ జితేందర్ రెడ్డి. పోలింగ్ స్టేషన్ లో గొడవ పై ఇరువురు పిర్యాదు చేసారు.రెండింటి పై విచారణ చేస్తున్నాం.ఎవరినీ కొట్టలేదు.
Spread the love