ఆర్మ్ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి

– గొంది రాజేష్ టి.ఏ.జీ.యస్ రాష్ట్ర కమిటీ సభ్యులు
నవతెలంగాణ-గోవిందరావుపేట : ఈ నెల 19,20,21 తేదీలలో తమిళనాడు రాష్ట్రం లోని మనక్కల్ లో జరగబోయే  ఏ.ఏ.ఆర్.ఎమ్ ఆదివాసి ఆధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గొంది రాజేష్ పిలుపినిచ్చారు. శనివారం మండలంలోని పసర గ్రామంలో సభలకు పలువు గిరిజనులను ఆహ్వానిస్తూ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ అటవీ హక్కుల చట్టం రూపకల్పనలో ముఖ్య భూమిక పోషించినది ఆర్మ్ నాయకత్వమేనని మరియు ఈ చట్టం రావడానికీ కృషి చేసిన వారిలో ముఖ్యులు కూడా ఆర్మ్ కి చెందిన నాయకత్వమేనని ఆయన గుర్తు చేశారు. దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న మతోన్మాదం  ఆదివాసుల పై తీవ్రమైన ప్రభావం పడుతున్నదని ఆయన అన్నారు. ప్రత్యేక తెగలుగా ఉన్న ఆదివాసులకు మతం రంగు పులమడానికి మత చాందస్సులు చేసే ప్రయత్నాలను ఆదివాసులు ఐక్యంగా ఎదుర్కోవాల్సి అవసరం ప్రస్తుత పరిస్థితుల్లో అనివార్యమని అన్నారు.  అలాగే తెలంగాణ రాష్ట్రంలో 2016 నుండి 2022 వరకు పెండింగులో ఉన్న తునికాకు బోనస్ రావడానికి గల కారణం ఆర్మ్ కి అనుబందంగా ఉన్న తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘమేనని తెలిపారు. అలాగే పోడు భూములకు పట్టాలు రావాలని దశాబ్ద కాలం పాటు నిరంతరం పోరాటాలు చేసిన తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘమును ఆదరించాలని ఈ ఆయన కోరుతూ ఈ మహాసభల్లో తీసుకోబోయే భవిష్యత్ కర్తవ్యాల కోసం తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం పూర్తిస్థాయిలో పనిచేస్తూ నిర్విరామంగా పోరాటాలు చేస్తుందని ఆయన తెలిపారు.
Spread the love