నవతెలంగాణ-మంగపేట:
కనీస వేతనం అమలు, ఉద్యోగ భద్రత వంటి అంశాలు సాధించే వరకు సిఐటియు ఆధ్వర్యంలో తాము చేపట్టిన పోరాటాన్ని విరమించబోయేది లేదని ఆశవర్కర్ల మండల శాఖ అధ్యక్షురాలు నాగమణి స్పష్టం చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని తహశీల్ధార్ కార్యాలయ ఆవరణలో ఆశావర్కర్లు చేపట్టిన దీక్షలు శనివారం నాటికి ఆరవ రోజుకు చేరుకున్నాయి. ఈ సంధర్బంగా వారు సిపిఎం, సిఐటియుల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం నుంచి తెలంగాణా సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు. అనంతరం సిపిఎం జిల్లా నాయకులు ముత్యాలు, ఆశవర్కర్ల మండల అధ్యక్షురాలు నాగమనిలు మాట్లాడుతూ ఆశాల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఖండించారు. ఆశవర్కర్ల న్యాయ మైన డిమాండ్లను తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే రానున్న రోజుల్లో మరింత ఉదృతంగా తమ పోరాటాలను కొనసాగి స్తామని హెచ్చరించారు .ఈ కార్యక్రమంలో సిఐటియు మండల శాఖ అధ్యక్షుడు రాజు, ఆశాలు, వజ్ర, దేవేంద్రమ్మ, స్వరూప తదితరులు పాల్గొన్నారు.