నూతన ఎస్ఐగా అశోక్ కుమార్ బాధ్యతలు

Ashok Kumar will be the new SIనవతెలంగాణ – లోకేశ్వరం 
మండల నూతన ఎస్ఐ గా శుక్రవారం అశోక్ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న సక్రియా నాయక్ బదిలీ కాగా నిజామాబాద్ ఐదవ టౌన్ లో విధులు నిర్వహించిన అశోక్ ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఈ క్రమంలో సిబ్బంది ఆయనను స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు మండల ప్రజలు సహకరించాలని కోరారు.
Spread the love