Monday, June 8, 2026
E-PAPER
Homeబీజినెస్ఏషియన్ పెయింట్స్ 'యాంటీ-డాంప్ టెక్నాలజీ' ఆవిష్కరణ

ఏషియన్ పెయింట్స్ ‘యాంటీ-డాంప్ టెక్నాలజీ’ ఆవిష్కరణ

- Advertisement -

– వాటర్-మార్క్ సమస్యకు ఇకపై చెక్
– ​ఎకానమీ విభాగంలో నాలుగేళ్ల వారంటీ కూడా

నవతెలంగాణ – విజయవాడ: ప్రతి ఒక్కరూ తమ ఇళ్లు అందంగా, సౌకర్యవంతంగా, ఏళ్ల తరబడి మన్నికగా ఉండాలని కోరుకుంటారు. అయితే, ఎకానమీ పెయింట్ విభాగంలో (అందుబాటు ధరల్లో ఉండే రంగులు) ఇవన్నీ ఉండే ఉత్పత్తులు చాలా వరకు కష్టమే. వీటన్నింటిలోనూ అత్యంత సాధారణమైన సమస్య గోడలపై వచ్చే నీటి మరకలు (వాటర్ మార్క్స్). ఇది ఇంటి అందాన్ని మెల్లగా దెబ్బతీస్తుంది. దీనిని గుర్తిస్తూ, ఈ సమస్యకు చెక్ పెట్టడానికి ఏషియన్ పెయింట్స్ ‘ఏస్’, ‘ట్రాక్టర్ ఎమల్షన్ల’లో ‘యాంటీ-డాంప్ టెక్నాలజీ’ని ఆవిష్కరించింది. అద్భుతమైన పనితీరు, ఆకర్షణీయమైన లుక్‌తో ఈ ఎకానమీ రేంజ్ ఉత్పత్తులపై నాలుగేళ్ల వారంటీని కూడా ఇస్తుంది. ఏషియన్ పెయింట్స్ అత్యంత నమ్మకమైన, విస్తృతంగా ఉపయోగిస్తున్న బ్రాండ్లలో ఒకటైన ‘ఏస్’, ‘ట్రాక్టర్ ఎమల్షన్లు’ ఎకానమీ విభాగంలో నాణ్యతను, విలువను అందించడం ద్వారా ఇంటి యజమానులు, డీలర్లు, కాంట్రాక్టర్ల నమ్మకాన్ని గెలుచుకున్నాయి. వినియోగదారుల అవసరాలను తీర్చడం కోసం ఈ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియో నిరంతరం కొత్త ఆవిష్కరణలను పరిచయం చేస్తూనే ఉంది. ఇందులో మెరుగైన విలువను అందించే ‘ట్రాక్టర్ & ఏస్ స్పార్క్’, తక్కువ ధరలో మెరిసే రూపాన్ని అందించే ‘ట్రాక్టర్ & ఏస్ షైన్’ కూడా ఉన్నాయి.

యాంటీ-డాంప్ టెక్నాలజీ పరిచయంతో ఏషియన్ పెయింట్స్ ఇంటి యజమానులు ఎదుర్కొనే అత్యంత సాధారణ సవాళ్లలో ఒక దానికి పరిష్కారాన్ని చూపుతూ నమ్మకమైన వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్తుంది. ఈ కొత్త సాంకేతికత గోడలపై నీటి మరకలు (వాటర్ మార్క్స్) పడకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. ఈ ఆవిష్కరణ ద్వారా ఎకానమీ పెయింట్ విభాగంలోని వినియోగదారులకు దీర్ఘకాలిక మన్నికను, మానసిక ప్రశాంతతను అందించడమే కంపెనీ లక్ష్యం. ఈ ముఖ్యమైన విషయాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో తెలియజేయడానికి సరికొత్త క్యాంపెయిన్ ప్రారంభించింది. ఈ యాడ్ ఫిల్మ్ లో ఒక ఇంటి యజమాని తన ఇంటికి వచ్చిన అతిథికి ఆతిథ్యం ఇస్తున్నప్పుడు ‘నీటి మరక’ (వాటర్ మార్క్) పదేపదే వారి మధ్యలోకి వస్తూ ఎలా అంతరాయం కలిగిస్తుందో చూపిస్తుంది. ఆ ఇంటి యజమాని ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, అత్యంత అసౌకర్యమైన సమయాల్లో ఆ నీటి మరక మళ్లీ మళ్లీ ప్రత్యక్షమవుతూ ఉంటుంది. గోడలు తడిసి ఆరిపోయిన తర్వాత వచ్చే నీటి మరకల వల్ల ఎదురయ్యే రోజువారీ ఇబ్బందులను ఈ కథనం కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. అదే సమయంలో యాంటీ-డాంప్ టెక్నాలజీ ఇటువంటి సమస్యలను ఎలా నివారిస్తుందో నొక్కి చెబుతుంది.

ఈ సందర్భంగా ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్ ఎండీ, సీఈఓ అమిత్ సింగిల్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వినియోగదారుల అంచనాలలో స్పష్టమైన మార్పును మనం చూస్తున్నామన్నారు. ధరల విభాగంతో సంబంధం లేకుండా ఇటు పని తీరు (మన్నిక), అటు అందం ఈ రెండూ సమానంగా ముఖ్యమని భావిస్తున్నారని తెలిపారు. ఏషియన్ పెయింట్స్‌లో వినియోగదారుల ఈ అవసరాలను నిరంతరం అర్థం చేసుకుంటూ ఇటువంటి వినూత్న పరిష్కారాలను భారతదేశంలోని మరిన్ని ఇళ్లకు అందుబాటులోకి తీసుకు వస్తున్నామన్నారు. ఈ విభాగంలోని మా ఉత్పత్తులు కీలకమైన పని తీరు ఫీచర్లపై నాలుగేళ్ల వారంటీతో ఇస్తున్నామన్నారు. ఇది వినియోగదారులకు మరింత విశ్వసనీయతను, దీర్ఘకాలిక విలువను అందిస్తుందన్నారు. ట్రాక్టర్, ఏస్ ఎమల్షన్లలో ‘యాంటీ-డాంప్ టెక్నాలజీ’ని ప్రవేశపెట్టడం ఈ నిబద్ధతను మరింత ముందుకు తీసుకెళ్తుందన్నారు. ఇది ఎకానమీ విభాగంలో నీటి మరకల సమస్యల నుంచి నమ్మకమైన రక్షణను అందించడమే కాకుండా, ప్రతి భారతీయ ఇంటికి అర్థవంతమైన ఆవిష్కరణలను అందుబాటులోకి తెస్తుందన్నారు. దీనితో ఎకానమీ పెయింట్ నుంచి వినియోగదారులు ఎలాంటి అంచనాలు పెట్టుకోవచ్చో నిరూపిస్తున్నామన్నారు. అందుబాటు ధరలు, అద్భుతమైన పని తీరు, సరికొత్త ఆవిష్కరణలను ఇది ఒకే చోట అందిస్తుందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -