నవతెలంగాణ – హైదరాబాద్ : భారతదేశంలోని ప్రముఖ వ్యవసాయ పరిష్కారాల ప్రదాతలలో ఒకటైన కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, భారతదేశంలోని ప్రముఖ వ్యవసాయ పర్యావరణ వేదిక అయిన సమున్నతి అగ్రి వాల్యూ చైన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒక అవగాహన ఒప్పందం (ఎంఓయు) చేసుకుంది. ఈ భాగస్వామ్యం, భారతదేశవ్యాప్తంగా ఉన్న రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు (ఎఫ్ పి ఓ లకు) వ్యవసాయ ఉత్పాదకాల సరఫరా, ప్రచారం , పంపిణీని సులభతరం చేస్తుంది.
కోరమాండల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (క్రాప్ న్యూట్రిషన్) శ్రీ నారాయణన్ వెల్లయన్ మరియు ఇరు సంస్థలకు చెందిన ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో కోరమాండల్ సంస్థ ఈవీపీ & బిజినెస్ హెడ్ (ఎరువులు, ఎస్‌ఎస్‌పీ & నానో) శ్రీ మాధబ్ అధికారి మరియు సమున్నతి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సురేష్ రాజగోపాలన్ ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. సమున్నతి యొక్క విస్తృతమైన ఎఫ్‌పిఓ (ఎఫ్ పిఓ) నెట్‌వర్క్‌ను మరియు పంట పోషణ, పంట రక్షణ, వ్యవసాయ సేవలలో కోరమాండల్ యొక్క నైపుణ్యాన్ని ఉపయోగించుకొని, కోరమాండల్ నుండి అధిక నాణ్యత కలిగిన వ్యవసాయ ఉత్పాదకాల లభ్యతను మెరుగుపరచడం, మార్కెట్ అవకాశాలను విస్తృతం చేయడం ఈ ఎంఓయు యొక్క ప్రధాన లక్ష్యం.
ఈ భాగస్వామ్యం సుస్థిర వ్యవసాయ వృద్ధికి తోడ్పడటానికి, ప్రత్యేకంగా రూపొందించిన మార్కెటింగ్ సహాయక కార్యక్రమాలు, ఉత్పత్తి ప్రదర్శనలు, సాంకేతిక పరిజ్ఞాన స్వీకరణ కార్యక్రమాలను కూడా అన్వేషిస్తుంది. దీనికి అదనంగా, ప్రత్యేక ఏర్పాట్లు, నియంత్రణ అవసరాలకు లోబడి, కోరమాండల్ ఉత్పత్తుల సేకరణ కోసం అర్హులైన ఎఫ్ పి ఓ లకు మరియు వ్యవసాయ పర్యావరణ వ్యవస్థ భాగస్వాములకు సమున్నతి ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్థిక సహాయం అందించవచ్చు.
కోరమాండల్ క్రాప్ న్యూట్రిషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ నారాయణన్ వెల్లయన్ మాట్లాడుతూ: “భారతదేశవ్యాప్తంగా రైతులకు వినూత్నమైన మరియు సుస్థిరమైన వ్యవసాయ పరిష్కారాలను అందించాలనే మా నిబద్ధతకు అనుగుణంగా సమున్నతితో ఈ భాగస్వామ్యం ఉంది. కోరమాండల్ యొక్క విస్తృతమైన ఉత్పత్తి శ్రేణిని, క్షేత్రస్థాయి నైపుణ్యాన్ని, ఎఫ్‌పిఓలు మరియు వ్యవసాయ వాల్యూ చైన్ లోని భాగస్వాములతో సమున్నతికి ఉన్న లోతైన అనుబంధాన్ని మేళవించటం ద్వారా నాణ్యమైన ముడి సరుకుల లభ్యతను మెరుగుపరచడం , అలాగే మరింత పటిష్టమైన, సమర్థవంతమైన వ్యవసాయ పర్యావరణ వ్యవస్థ వృద్ధికి మద్దతు ఇవ్వడం మా లక్ష్యం” అని అన్నారు.
సమున్నతి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సురేష్ రాజగోపాలన్ మాట్లాడుతూ, “సమున్నతి వద్ద మేము వ్యవసాయ పర్యావరణ వ్యవస్థ అంతటా సమిష్టి శ్రేయస్సును సాధించడానికి కట్టుబడి ఉన్నాము. కోరమాండల్ తో మా భాగస్వామ్యం, నాణ్యమైన వ్యవసాయ ఉత్పాదకాలను తుది వరకు లభించే అవకాశాలను విస్తృతం బలోపేతం చేయడానికి, సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడానికి మరియు సమీకృత మార్కెట్ అనుసంధానం, ఆర్థిక చేరిక పరిష్కారాల ద్వారా ఎఫ్ పి ఓ లు, గ్రామ స్థాయి పారిశ్రామికవేత్తలు (విఎల్ఈ లు) మరియు రైతులకు అధిక విలువను సృష్టించడానికి సహాయపడుతుంది” అని అన్నారు.



