ఆస్ట్రేలియాకు అసాంజే

– సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత స్వదేశానికి
కానెబెర్రా : అమెరికా కీలక రహస్యాన్ని బహిర్గతం చేసి.. సంచలనం సృష్టించిన వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజే తన తప్పును అంగీకరించాక.. తన సొంత దేశం ఆస్ట్రేలియాకు వెళ్లారు. అమెరికాలోని మరియానా దీవుల రాజధాని సైపాన్‌ నుంచి ఆరు గంటలపాటు ప్రయాణం చేసి ఆస్ట్రేలియా రాజధాని కాన్‌ బెర్రా చేరుకున్నారు. యూఎస్‌ జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ ముందు హాజరైన ఆయన ఒక ఒప్పందం ప్రకారం తన తప్పును అంగీకరించారు. దీంతో అసాంజే విడుదలకు మార్గం సుగుమమైంది. దశాబ్దకాలానికిపైగా న్యాయ పోరాటం తర్వాత స్వేచ్ఛ వాయువులు పీల్చుకునేందుకు వీలైంది.

Spread the love