8 నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు..?

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఈనెల 8 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. తొలిరోజు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ డాక్టర్‌ తమిళి సై ప్రసంగించనున్నారు. తొమ్మిదిన గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ కొనసాగనుంది. ఈనెల 10న ప్రభుత్వం శాసనసభలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుందని సమాచారం. ఆ మరుసటి రోజు ఆదివారం. అందువల్ల ఆ రోజు కాకుండా సోమవారం (12) నుంచి బడ్జెట్‌పై చర్చను ప్రారంభించనున్నారు. అప్పటి నుంచి ఓ ఐదారు రోజులపాటు సభ కొనసాగే అవకాశాలున్నాయని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. అయితే సమావేశాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Spread the love