నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ తన వ్యక్తిగత జ్యోతిష్యుడు రాజన్ పండిట్‌ను ‘ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ’ (OSD)గా నియమించుకోవడంపై రాజకీయంగా దుమారం రేగుతోంది. తాజాగా ఈ అంశంపై టీవీకే ప్రభుత్వం స్పందించింది. రాజన్ పండిట్‌ను OSD నియమాకాన్ని రద్దు చేసింది.
కాగా, విజయ్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ అసెంబ్లీ వేదికగా తీవ్రంగా ఖండించారు. జ్యోతిష్యుడికి అధికారిక పదవి కట్టబెట్టడంపై ఆమె మండిపడుతూ, రాజన్ పండిట్ విజయ్‌కు వ్యక్తిగత గురువు అయితే ఆయనను సొంత పనులకే పరిమితం చేసుకోవాలని, ప్రభుత్వ వ్యవస్థలోకి తీసుకురావడం సరికాదని హితవు పలికారు. యువత ఎంతో నమ్మకంతో విజయ్‌కు ఓట్లు వేశారని, ఇప్పుడు ఇటువంటి నిర్ణయాల ద్వారా భావి తరానికి ఆయన ఎలాంటి ఉదాహరణగా నిలుస్తున్నారో సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.


