Wednesday, May 13, 2026
E-PAPER
Homeజాతీయంనీట్ ప‌రీక్ష ర‌ద్దు..జెన్-జెడ్‌కి కేజ్రీవాల్ కీల‌క పిలుపు

నీట్ ప‌రీక్ష ర‌ద్దు..జెన్-జెడ్‌కి కేజ్రీవాల్ కీల‌క పిలుపు

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: నీట్ పేప‌ర్ లీకేజీపై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ క‌న్వీనర్ అర‌వింద్ కేజ్రీవాల్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. నీట్ ప‌రీక్ష ర‌ద్దును వ్య‌తిరేకిస్తూ జెన్-జెడ్ వీధుల్లోకి, రోడ్ల‌ల‌పై నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు చేప‌ట్టాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ప్ర‌భుత్వ బాధ్య‌త‌రాహిత్యాన్ని, నిర్ల‌క్ష్యాన్ని ప్ర‌శ్నించాల‌ని సూచించారు. మోడీ అధికారంలోకి వ‌చ్చినకానుంచి 93సార్లు పేప‌ర్ లీకేజీ సంఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయ‌ని, అది కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఎక్కువ జ‌రిగాయ‌ని ఆయ‌న ఢిల్లీ మీడియా స‌మావేశంలో మాట్లాడారు. ఈ త‌ర‌హా లీకేజీ వ‌ల్ల 6 కోట్ల మంది విద్యార్థులు తీవ్రంగా న‌ష్టపోయార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇందులో మంత్రుల ప్రమేయం ఉంద‌ని, సీఐబీ వారి ప‌ట్ల ఏం చేయాల‌ని చూస్తోంద‌ని ప్ర‌శ్నించారు.

‘చాలా వరకు పేపర్ లీక్ ఘటనలు బీజేపీ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్, యూపీ, ఉత్తరాఖండ్, గుజరాత్‌లలో జరిగాయి. ఈ రాష్ట్రాల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలు ఉండటం యాదృచ్ఛికం కాదు. ఇది ఒక అనుమానాన్ని రేకెత్తిస్తోంది – వారి నాయకుల ప్రమేయం ఉందా? ఒకవేళ అదే నిజమైతే, సీబీఐ ఏం చేయగలదు?

నేను జెన్-జెడ్‌ను అడగాలనుకుంటున్నాను “నేపాల్-బంగ్లాదేశ్ జెన్-జెడ్‌ల మాదిరిగా రోడ్లపైకి వచ్చి వారి ప్రభుత్వాలను మార్చగలిగినప్పుడు, మన జెన్-జెడ్ పేపర్ లీక్ ఘటనలలో ప్రమేయం ఉన్న మంత్రులను జైలుకు పంపలేరా? మీపై నాకు పూర్తి విశ్వాసం ఉంది.” పేపర్ లీక్‌లలో ప్రమేయం ఉన్న వ్యక్తులకు వ్యతిరేకంగా వీధుల్లోకి రావాలని’ కేజ్రీవాల్ జెన్-జెడ్‌కు పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -