రాత్రి అల్లుడు, పొద్దున అత్త మృతి..

నవతెలంగాణ – మెదక్‌: గంటల వ్యవధిలోనే అల్లుడు, అత్త చనిపోయిన ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మెదక్‌ జిల్లా చేగుంట మండలంలో మక్కరాజుపేటకు చెందిన నరసింహులు (58) ఆదివారం రాత్రి గుండెపోటుతో మృతిచెందారు. అల్లుడి మరణం తట్టుకోలేక అత్త నర్సవ్వ కూడా  సోమవారం ఉదయం మరణించింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Spread the love